calender_icon.png 16 February, 2026 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు తారిఖ్ ప్రమాణం

16-02-2026 12:13:43 AM

ఢాకా పార్లమెంటులో ప్రధానిగాప్రమాణ స్వీకారం

12దేశాల అధినేతలకు ఆహ్వానం

ప్రమాణ స్వీకారానికి భారత ప్రతినిధిగా స్పీకర్ ఓం బిర్లా 

ఢాకా, ఫిబ్రవరి : బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఘన విజయం తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. దీంతో మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహ్మాన్ ఫిబ్రవరి 17న కొత్త ప్రధానిగా ప్ర మాణ స్వీకారం చేయనున్నారు. ఈ ఎన్నికల్లో 297 సీట్లకు గాను బీఎన్పీ  209 సీట్లు గెలుచుకుని భారీ మెజారిటీ సాధించింది. 2024 ఆగస్టులో విద్యార్థుల ఆందోళనల కా రణంగా షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయి న తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి.

సుమారు 17 ఏళ్ల ప్రవాసం తర్వాత తారిఖ్ రెహమాన్ తిరిగి వచ్చి దేశ పగ్గాలు చేపట్టబోతుండటం విశేషం.  సాధారణంగా ఈ వేడు క అధ్యక్ష భవనమైన ’బంగ్లాభవన్’లో జరుగుతుంది. కానీ ఈసారి అతిథుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో పార్లమెంటు భవనంలోని  ’సౌత్ ప్లాజా’లో  నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 17 ఉదయం  కొత్త ఎంపీలు ప్రమాణం చేస్తారు. అదే రోజు సాయంత్రం   తారిఖ్ రెహమాన్, ఆయన మంత్రివర్గ సభ్యుల చేత అధ్యక్షుడు మహమ్మద్ షహబుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.

చిన్న మంత్రివర్గంతో ప్రారంభం

తారిఖ్ రెహమాన్ ప్రారంభంలో కేవలం కొద్దిమంది సభ్యులతో కూడిన చిన్న క్యాబినెట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి మంత్రివర్గాన్ని విస్తరిస్తారు. ఈ క్యాబినెట్‌లో అనుభవజ్ఞులైన నేతలకు చోటు దక్కే అవకాశం ఉంది. ఎంపీల ప్రమా ణ స్వీకారం పూర్తయిన తర్వాత పార్లమెంటరీ బోర్డు సమావేశమై అధికారికంగా తారి ఖ్‌ను తమ నాయకుడిగా ఎన్నుకుంటుంది. ఆతర్వాత ఆయన అధ్యక్షుడిని కలిసి ప్రభు త్వం ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.

విదేశీ ప్రతినిధులకు ఆహ్వానం

బంగ్లాదేశ్ ప్రధాని ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాలని బంగ్లాదేశ్ ప్రభు త్వం భారత్‌ను  ఆహ్వానించింది. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ముహమ్మద్ యూనస్ భారత్‌తో పాటు చైనా, పాకిస్థాన్, సౌదీ అరేబియా సహా మరో 12 దేశాలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరపున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు.  అయితే అదే రోజున ముంబైలో ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపాల్సి ఉంది. ఈ ముందస్తు కార్యక్రమాల వల్ల ప్రధాని ఢాకా వెళ్లడం లేదు. ఓం బిర్లా ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా బంగ్లాదేశ్ సంబంధాల కు భారత్ ఇస్తున్న ప్రాముఖ్యతను ప్రభుత్వం చాటిచెప్పింది.

పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది. అయితే ప్రధాని మోదీ పర్యటనపై భారత ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ధ్రువీకరణ రావాల్సి ఉంది.  ఒకవేళ దేశాధినేతలు రాలేని పక్షంలో ఆయా దేశాల ప్రతినిధులు లేదా విదేశాంగ మంత్రు లు హాజరవుతారని భావిస్తున్నారు. భారత్‌తో సంబంధాల గురించి తారిఖ్ రెహమా న్ స్పందిస్తూ తమ దేశ ప్రయోజనాలే విదేశాంగ విధానానికి పునాది అని పేర్కొన్నారు. భారత్, చైనా, పాకిస్థాన్ వంటి ప్రాంతీయ శక్తులతో సమతుల్య సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.