31 August, 2026 | 10:33 AM

Breaking News

40 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   హరీష్ నాయక్ కుటుంబానికి ఎంపీ ‘వేం’ పరామర్శ   •   రాష్ట్ర మహా సభల గోడ పత్రికల ఆవిష్కరణ   •   పలువురు మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి శ్రీధర్‌బాబు   •   నేడు మహబూబాబాద్ జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన   •   రిటైర్మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి: టీఎస్‌జీఆర్‌ఈఏ జిల్లా అధ్యక్షులు   •   తాజుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన బిఆర్ఎస్ పార్లమెంటరీ నేత   •   జర్నలిస్టుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించం: మాటేటి వేణుగోపాల్   •   ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడిగా పుల్లయ్య   •  

గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత

15-05-2026 11:26 AM

బోథ్, (విజయక్రాంతి): ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న జొన్న పంట మొక్కజొన్న పంట లకు అవసరమైన గన్ని బ్యాగులు దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.అంతేగాక మార్కెట్ యార్డులో స్థలం లేకపోవడంతో రైతులు తీసుకొచ్చిన పంటను విక్రయించేందుకు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని నిరసిస్తూ శుక్రవారం ఉదయం బోత్ మార్కెట్ యార్డులో ఉన్న రైతులు రోడ్డెక్కి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. బోథ్  బస్టాండ్ సమీపంలోని కోరమండల్ ఎరువుల దుకాణం ఎదుట రోడ్డుపై బైఠాయించారు.

దీంతో వాహనాల రాకపోకకు  ఇబ్బందులు ఎదురయ్యాయి విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై ఆందోళన చేపడుతున్న రైతులతో మాట్లాడి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడం జరిగింది. అంతేగాక జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ స్వామితో మాట్లాడారు. రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు .దీనితో రైతులు శాంతించారు. కాగా అధిక దిగుబడి వల్ల జొన్న పంట మొక్కజొన్న పంట మార్కెట్కు తీసుకురావడంతో స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండల సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి వాపోయారు.అధికారులు స్థానికంగా ఉన్న జిన్నింగ్ యజమానులతో మాట్లాడి అక్కడ రైతులు పంట వేసే విధంగా చూడాలని కోరారు.