నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం
15-05-2026 11:27 AM
బోథ్,మే15(విజయక్రాంతి): రైతులకు ఇబ్బందులు రాకుండా పంట కొనుగోలు చేపట్టాలని ఎమ్మెల్యే జాదవ్ అనిల్(MLA Jadhav Anil) పేర్కొన్నారు. శుక్రవారం నేరడిగొండ బజార్హత్నూర్ దేగామా లలో జొన్న పంట కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు గన్ని బ్యాగులు దొరకక ఇబ్బందులు పడుతున్నారని మరోవైపు కొనుగోలు కేంద్రాల నుండి జొన్న పంటను సకాలంలో తరలించకపోవడం వల్ల స్థలం లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులకు సరైన వసతులు తక్షణమే కనిపించాలని లేకుంటే రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఆయన వెంట నేరడిగొండ మాజీ జెడ్పిటిసి గడ్డం భీమ్ రెడ్డి మాజీ సర్పంచ్ ఓరుస రాజు తో పాటు ఆయా మండలాల నాయకులు పాల్గొన్నారు






