7 May, 2026 | 1:29 AM

రోడ్డెక్కిన రైతన్నలు

07-05-2026 12:00 AM

ధాన్యం కొనుగోలులో జాప్యం 

కోహెడ, నంగునూరు, జగదేవపూర్ మండలాల్లో నిరసన 

జగదేవపూర్/ నంగునూరు/కోహెడ, మే 6: సిద్దిపేట జిల్లాలో ధాన్యం కొనుగోలులో అధికారులు జాప్యం చేస్తున్నారంటూ రైతులు రోడ్డెక్కి నిరసన తెలిపారు. తాలు పేరుతో బి గ్రేడ్ ద్వారా కొనుగోలు చేస్తూ రైతులను నష్టాలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.

సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని బస్వాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద, నంగునూరు మండలం ముండ్రాయి గ్రామం హనుమకొండ రహదారిపై జగదేవపూర్ మండలంలోని చాట్లపల్లిలో రైతులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. అధికారుల పనితీరులో మార్పు లేకపోతే నిరసన తీవ్రతరం చేస్తామంటూ రైతులు హెచ్చరించారు. పోలీసులు జోక్యం చేసుకొని రైతులచే నిరసన నిర్వహింప చేశారు. తాలు పేరుతో గ్రేడ్ తగ్గిస్తే ధాన్యాన్ని విక్రయించమంటూ రైతులు వెల్లడించారు.