18 April, 2026 | 11:41 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

భూ భారతి చట్టంతో రైతులకు ఎంతో మేలు

25-04-2025 12:40 AM

ముత్తారంలో  భూ భారతి చట్టం అవగాహన లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

ముత్తారం, ఏప్రిల్24 (విజయ క్రాంతి): భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన  నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుం దని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.  గురువారం ముత్తారం మండల తహసిల్దార్ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష పాల్గొన్నారు.

ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ  భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్ల పై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే  అవకాశం ఉందన్నారు. రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్, తహసిల్దార్ మధు సూదన్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ అల్లాడి యాదగిరిరావు, మాజీ జడ్పిటిసిలు నాగినేని జగన్మోహన్ రావు, చొప్పరి సదానందం, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.