18 August, 2026 | 7:39 PM

డంపింగ్ యార్డ్ ను జనావాసాలకు దూరంగా పెట్టాలి

18-08-2026 07:02 PM

ముకరంపుర: కరీంనగర్ నగర ప్రజల ఆరోగ్యం, మరియు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో పెట్టుకుని బైపాస్‌ రోడ్డులో ఉన్న డంప్‌యార్డ్‌ను  అక్కడి నుండి ఎత్తివేసి నగరానికి దూరంగా తరలించాలని తెలంగాణ రక్షణ సేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఈరోజు తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ నియోజకవర్గ ‌ఇంచార్జ్ అంకం శివరాణి   ఆద్వర్యంలో  డంపింగ్ యార్డ్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈ సందర్భంగా గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ... కరీంనగర్ నగరంలోని డంపింగ్ యార్డ్‌లో సంవత్సరాలుగా పేరుకుపోయిన చెత్త కారణంగా దుర్వాసన, పొగ, దుమ్ము, ఇతర పర్యావరణ సమస్యలు ఏర్పడుతున్నాయి.

సగం నగరం అంతా పోగతో దుమ్ముతో కరీంనగర్ ప్రజలు తీవ్రమైన అరోగ్య ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కరీంనగర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైన యుద్ద ప్రాతిపాదికన  నగరానికి దూరంగా తరలించి  బయోమైనింగ్ ద్వారా చెత్తను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేసినారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మ్యాకల తిరుపతి, జిల్లా అదివాసి విభాగం  అధ్యక్షుడు కుతాడి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.