19 June, 2026 | 12:25 PM

Breaking News

రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు   •   ఫాస్ట్ ఫుడ్ లవర్స్ జర భద్రం... గోదాంలో దొరికిన రంగులు, కుళ్లిన చికెన్   •   సికిల్ సెల్ దినోత్సవ అవగాహన ర్యాలీ   •   లో లెవల్ బ్రిడ్జిపై హై లెవెల్ బ్రిడ్జిని నిర్మించాలి   •   రామన్నగూడెం ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు   •   టెలిగ్రామ్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు   •   ఫిన్లాండ్‌లో తెలంగాణ విద్యార్థి మిస్సింగ్‌.. ఇంకా వీడని మిస్టరీ   •   అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య   •   పేరుకే ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం   •   సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం   •  

అగ్రహారంలో తీవ్ర విషాదం.. ముగ్గురు పిల్లలకు విషమిచ్చి, తండ్రి ఆత్మహత్య

19-06-2026 10:35 AM

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం(Cheemakurthi Mandal) అగ్రహారంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఓ కన్నతండ్రి ముగ్గురు కుమార్తెలకు ఆహారంలో విషం కలిపి ప్రాణాలు తీశాడు. మృతిచెందిన కుమారైలు గోచిత(13), పూజిత(11), లోకితశ్రీ(8)గా గుర్తించారు. ముగ్గురు బిడ్డలకు విషమిచ్చిన తండ్రి సుధాకర్(35) అనంతరం ఆత్మహత్య చేసుకున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, భార్య వదిలేసి వెళ్లిపోవడంతో తీవ్ర మానసిక ఆవేదనకు లోనైన సుధాకర్ కన్న కూతుళ్ల పట్ల కాలయముడయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కుటుంబ కలహాల వల్లే తండ్రి నిర్ణయం తీసుకున్నట్లు  పోలీసులు తెలిపారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.