రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
19-06-2026 12:16 PM
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి(Rahul Gandhi birthday) పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మంచి ఆరోగ్యం, దీర్ఘాయువుతో జీవించాలని ఆకాంక్షించారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరిస్తున్న గాంధీ శుక్రవారం నాడు 56వ ఏట అడుగుపెట్టారు. "లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థిస్తున్నాను," అని మోదీ 'ఎక్స్' వేదికగా చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. అటే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపు సంబరాలు జరుపుకుంటున్నారు.






