సింగరేణిలో ఐదో రోజు కవిత బాయిబాట కార్యక్రమం
19-06-2026 10:09 AM
సింగరేణి బాయిబాటలో భాగంగా ALP మైన్ వద్ద గేట్ మీటింగ్
హైదరాబాద్: సింగరేణిలో తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత ఐదోరోజు 'బాయిబాట' (Kavitha’s Baayibaata Mine Tour)కార్యక్రమం కొనసాగుతోంది. ఐదోరోజు రామగుండం పరిధిలోని అడ్రియాల గనిని కవిత స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు. అడ్రియాల లాంగ్ వాల్ మైన్ వద్ద సింగరేణి కార్మికులతో కవిత సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికుల సమస్యలను తెలుకున్నారు. కార్మికుల సమస్యలపై తాను పోరాటం చేస్తానని కవిత హామీ ఇచ్చారు.






