తండ్రి అండ.. కొడుకు కబ్జా!
- అబ్దుల్లాపూర్‌మెట్‌లో కబ్జాబాగోతం
- అన్ని నడిపిస్తున్న మణికొండ మున్సిపల్ కమిషనర్ కొడుకు
- తెర వెనక వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న తండ్రి
- ఆఫీసర్లే కబ్జాలను ప్రోత్సహిస్తే ఎలా?
- అధికారుల తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువ
- నిత్యం ప్రజావాణికి ఫిర్యాదులు.. పట్టించుకోని వైనం
అబ్దుల్లాపూర్ మెట్, సెప్టెంబర్ 2: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ లో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై కొత్త, కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. కంచెచేను మేసిన చందంగా కబ్జాల వెనక మణికొండ మున్సిపల్ కమీషనర్ ఏ అన్ని వ్యహారాలు చక్కబెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58,59 జీవో కింద అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరణ కోసం జీవో ను తీసుకొచ్చింది.ఆ జీవో కొందరు అక్రమార్కులు అనుకూలంగా మార్చుకొన్నారు.
58, 59 జీవో కింద నిబంధనలకు విరుద్ధంగా కమిషనర్ ప్రదీప్కు మార్ కొడుకు సుఖేష్ పసుమామలలో 131 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకొని దాని సమీపంలో వెయ్యి గజాలకుపైగా ప్రభుత్వ స్థలంపై కన్నేశాడు. అట్టి ప్రభుత్వ స్థలంను ఆక్రమించి కమర్షియల్ దుకాణాలను నిర్మించడంపై అంతా నో రేళ్ల బెడుతున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 క్రమబద్ధీకరణ జీవో పేదల మాటున పెద్దలు లబ్ధి పొందుతున్నారని విమర్శలు ఉన్నాయి.
క్రమబద్ధీకరణ వ్యహారం లో తెరవెనుక ఉండి అన్ని వ్యవస్థలను మేనేజ్ చేస్తూ అక్రమార్కులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. నిరుపేదల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన 58, 59 జీవో పలు అక్రమా లు వెలుగు చూస్తుండడం విస్మ యం కలిగిస్తుంది.
మండలంలో క్రమబద్ధీకర ణ కోసం పెట్టుకున్న దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలిస్తే మరిన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉంది. అందుకే ఆక్రమ ణదారులు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జాచేసి.. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటిని కూల్చడంలో నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారు.
ప్రజావాణికి ఫిర్యాదులు..
ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్కడ నిర్మాణాలపై చేపట్టడంపై స్థానికులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని.. వెంటనే నివేదిక ఇవ్వాలని స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారుల్లో చలనం రావడం లేదు. కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేస్తూ నోటీసుల పేరుతో ఇవాళ, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఆక్రమణ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని రెవెన్యూ అధికారుల తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి.
కబ్జా ఎలా చేశారంటే..?
పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 386లో ప్రభుత్వ భూమి ఉంది. మణికొండ మున్సిపల్ కమిషనర్ డి.ప్రదీప్‌కుమార్ కుమారుడు డీవీఎన్‌సుఖేష్58, 59 జీవో ద్వారా క్రమబద్ధీకరణ చేసుకున్నాడు. మున్సిపల్ కమిషనర్ కుమారునికి ఇందు లో 131 గజాలు మాత్రమే క్రమబద్ధీకరణ అయింది. గతంలో రెవెన్యూ అధికారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండానే క్రమబద్దీకరణ చేశారు. ప్రభుత్వ ఖాళీ స్థలానికే రెగ్యులర్ చేశారు. అలాగే ఆ ప్లాటు చుట్టు ఎలాంటి బౌండరీలు లేవు.
అలాగే ఆయన 1000 గజాలు కబ్జా చేసి.. అందులో కమర్షియల్ షెటర్లు నిర్మించారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. దీంతో కలెక్టర్ కార్యాలయం నుంచి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఉన్నప్పటికీ .. నోటీసుల పేరుతో రేపు మాకు అంటూ రెవెన్యూ అధికారులు కాలయాపన చేస్తున్నారు.
రెవెన్యూ అధికారులకు పొలిటికల్ లీడర్ల నుంచి ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా.. అక్రమ నిర్మాణాలపై మున్సిపల్, రెవెన్యూ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేక పోతున్నారు. పలు అనుమానాలకు దారితీస్తుంది. ఈ అనుమానాలు తొలగలంటే.. వెంటనే అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాల్సిందే.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్..
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ పూర్ మెట్ మండలం పసుమాముల గ్రామ రెవెన్యూ సర్వేనెంబర్ 386లో ఉన్న ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు స్థానికులు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదులపై వెంటనే స్పందించిన అధికారులు సంబంధిత స్థానిక రెవెన్యూ అధికారులకు ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణాలపై అనే చర్యలు ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ ఇప్పటివరకు ఆ అక్రమ నిర్మాణాలపై ఇలాంటి తీసుకోలేదంటే కలెక్టర్ ఆదేశాలను కూడా రెవెన్యూ అధికారుల పట్టించుకోవడలేదు.
చర్యలు తీసుకుంటాం
పసుమాముల సర్వే నెంబర్ 386లో అక్రమ నిర్మాణాలపై సర్వేయర్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ల పూర్తి స్థాయిలో సర్వే చేసి రిపోర్టు ఇవ్వాలని ఆదేశించా. అక్కడ నిర్మించిన నిర్మాణాలు అక్రమం అయితే వెంటనే చర్యలు తీసుకుంటాం.
- సుదర్శన్‌రెడ్డి, తహసీల్దార్ అబ్దుల్లాపూర్‌మెట్






