7 August, 2026 | 6:53 PM

సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ ఆందోళనలు

03-09-2025 12:00 AM

హోరెత్తిన నిరసనలు, రాస్తారోకోలు

సంగారెడ్డి/ పటాన్‌చెరు / నారాయణఖేడ్/ జహీరాబాద్ , సెప్టెంబర్ 2 : సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు ధర్నా లు, రాస్తారోకోలు చేపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై, కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న తప్పుడు ఆరోపణలకు నిరసనగా జిల్లాలో గులాబీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ నేతృత్వంలో కొత్త బస్టాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.

పటాన్‌చెరులో నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి ఆధ్వర్యంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద నిరసన తెలిపారు. నారాయణఖేడ్‌లో మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆధ్వ ర్యంలో రాజీవ్ చౌక్ వద్ద ధర్నా చేపట్టారు. జహీరాబాద్‌లో ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో, నిరసన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాల్లో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.