నీటిసమస్యను తీర్చిన పబ్బ మహేశ్‌గుప్తా
శివంపేట్, సెప్టెంబర్ 2 : శివంపేట మండల కేంద్రంలోని ఐదు రోజులుగా పలు వార్డుల్లో ప్రజలు తాగునీటి సమస్యతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నపబ్బ మహేష్ గుప్తా యువసేన సభ్యులు మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్తా దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో స్పందించిన ఆయన తన సొంత నిధుల నుండి రూ.15000లతో పంపు, కొత్త బోరు మోటర్ ను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఉప సర్పంచ్ రాజీపేట పద్మా వెంకటేశ్వర్, గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దగాళ్ల లక్ష్మి నరసయ్య, వార్డు సభ్యులు బిజిలిపురం కృష్ణ, వంజరి కొండల్, సీనియర్ నాయకుడు బాసంపల్లి రామాగౌడ్, అశోక్, దొడ్ల అశోక్, కమలయ్య గారి యాదగిరి, గౌడిగూడెపు నర్సింలు, కొత్తపేట రాములు, బండ అంజయ్య, క్యాసని వెంకటేష్, కమలయ్య గారి నర్సింలు, శేషని లచ్చయ్య, వజ్జ వెంకటేష్ పాల్గొన్నారు.






