4 August, 2026 | 1:52 AM

ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి

04-08-2026 12:00 AM

బీజేవైఎం డిమాండ్

మొయినాబాద్ ఆగస్టు 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం జేబీఐఈటీ కళాశాల వద్ద బీజేవైఎం ఆధ్వర్యంలో ’ఫీజులు బకాయిబీజేపీ లడాయి’ నిరసన కార్యక్రమం నిర్వహించారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి, శ్రీశైలం యాదవ్ పాల్గొని మాట్లాడారు. నిధుల విడుదలలో ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం వల్ల పేద, మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని, కళాశాలలు ఆర్థికంగా నష్టపోతున్నాయని మండిపడ్డారు. బకాయిలు వెంటనే చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో చేవెళ్ల అసెంబ్లీ ఇన్చార్జి షాపురం శ్రీకాంత్తో పాటు పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.