4 August, 2026 | 1:50 AM

ప్లాస్టిక్ వద్దు.. ప్రకృతి ముద్దు

04-08-2026 12:00 AM
  1. ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
  2. అవగాహన ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్

గజ్వేల్, ఆగస్టు 3  (విజయ క్రాంతి) : ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిర్మూలించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించడం ప్రతి పౌరుడి బాధ్యత అని గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్ అన్నారు. ప్లాస్టిక్ రహిత వారోత్సవాల ముగింపు సందర్భంగా సెయింట్ మేరీస్ విద్యానికేతన్ హైస్కూల్, రోటరీ క్లబ్ విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

ప్లాస్టిక్ వల్ల పర్యావరణం, ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని పేర్కొంటూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధాన్ని మున్సిపాలిటీ కఠినంగా అమలు చేస్తోందన్నారు. గుడ్డ సంచులు, స్టీల్ బాటిళ్లు వినియోగించాలని ప్రజలకు సూచించారు.

మున్సిపల్ కమిషనర్ గణేష్ రెడ్డి, వైస్ చైర్మన్ పద్మా నర్సింగరావు, పాఠశాల కరస్పాండెంట్ గోపు ఇన్నారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్లాస్టిక్ నిషేధానికి రాయబారులుగా మారాలని కోరారు. అనంతరం ‘ప్లాస్టిక్ వద్దు.. ప్రకృతి ముద్దు‘ అంటూ ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గజ్వేల్ అధ్యక్షుడు సాయి రెడ్డి, కోశాధికారి కరుణాకర్ రెడ్డి, చైర్మన్లు కొడాలి చంటి, కర్ణాకర్ రెడ్డి, ఎన్సీసీ క్యాడెట్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.