21 July, 2026 | 12:27 PM

దుబాయ్‌లో ఘనంగా బోనాల మహోత్సవం

21-07-2026 02:32 AM

పాల్గొన్న మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జయపాల్ రెడ్డి

కరీంనగర్, జూలై 20 (విజయ క్రాంతి): దుబాయ్ లోని రాస్ అల్ ఖైమా మైత్రి ఫార్మ్సో్ల ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యూఏఈలోని వివిధ ఎమిరేట్స్ల నుంచి సుమారు 400 మంది తెలంగాణ ప్రవాసులు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో గౌరమ్మ పూజ, బోనాల సమర్పణ, కుంకుమార్చన, మహాహారతి, దీపోత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

పట్టు చీరలు ధరించిన మహిళలు తలపై బోనాలు మోసుకుంటూ నిర్వహించిన ఊరేగింపు, ఒగ్గు డోలు మోతలు, పోతురాజుల విన్యాసాలు తెలంగాణ సంస్కృతిని విదేశీ నేలపై ఆవిష్కరించాయి. ముఖ్య అతిథిగా మైత్రి గ్రూప్ వ్యవస్థాపకులు కొత్త జైపాల్ రెడ్డి హాజరై మాట్లాడుతూ విదేశాల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తున్న ఈటిసిఏ సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో ఈటిసిఏ వ్యవస్థాపక అధ్యక్షుడు కిరణ్ కుమార్ పీచర,

అధ్యక్షుడు జగదీష్ రావు చీటీ, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ ఎలిగేటి, ప్రధాన కార్యదర్శి రాణి కొట్ల, సంయుక్త కార్యదర్శి శేఖర్ గౌడ్ గుండవేని, కోశాధికారి తిరుమల్ రావు బీరెల్లి, మాజీ అధ్యక్షులు రాధారపు సత్యం, సీనియర్ సభ్యులు వెంకటేశ్వర్ రావు, ఎస్.పీ. కస్తూరి, సురేష్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు వినోద్ ఆచారి, రఘు ఎలిగేటి, రాము కందుకూరి, సామ శ్రీనివాస్ రెడ్డి, రాజేష్ పోలంపల్లి, కిరణ్ చెట్టిగారి, సారిక పీచర, మమత కస్తూరి, అన్నపూర్ణ, మౌనిక గౌడ్, మధు కుమార్, వనజ గోగుల, రనీషా, విపుల, స్వప్న, దీపిక, తదితరులు పాల్గొన్నారు.