21 July, 2026 | 12:20 PM

తేలిన కొదురుపాక రహదారి

21-07-2026 02:36 AM

తేలిన వ్యవసాయ భూములు ఇల్లు 

బోయినపల్లి: జూలై 20(విజయ క్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండ లం కోదురుపాక-శాభాష్ పల్లి పాత రహదారి వంతెన తేలింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మాన్వాడ వద్ద శ్రీ రాజరాజేశ్వర జలాశయం 27.55 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం కలిగిన ప్రాజెక్టు ని ర్మాణం జరిగింది. ఇందులో తొమ్మిది గ్రా మాలు పూర్తిగా మరో 9 గ్రామాలు పాక్షికం గా ముంపునకు గురయ్యాయి.

ఈ నేపథ్యంలో వేములవాడ సిరిసిల్ల ప్రధాన రహదారిలో బోయినపల్లి మండలం కుదురు పాక వద్ద కుదురుపాక నుంచి శాభాష్ పల్లి వరకు పాతది మినీ వంతెన ఉండగా జలాశ యం నిర్మాణంలో ముంపునకు గురైంది. దాని స్థానంలో హైలైవల్ వంతెన నిర్మాణం జరిగి రవాణా జరుగుతుంది. ఈ తరుణం లో జలాశయంలో నీటి నిలువ లేకపోవడం తో ప్రాజెక్టు కల తప్పింది. మాన్వాడ శ్రీ రాజరాజేశ్వర జలాశయం 2017 సంవత్సరంలో వినియోగం లోకి వచ్చి ఈ ప్రాంత రైతులతోపాటు దిగువన ఉన్న జిల్లాలకు సాగు నీరు అందించింది .

ప్రస్తుతం జలాశయంలో 7.741 టీఎంసీల నీటి నిల్వ వున్నది. జలాశయంలో ఇంత తక్కువగా నీటి నిలువ ఉండ డం ఇది మొదటిసారి. జలాశయంలో ఎప్పుడైనా కనీసం సగం వరకు నీటి నిలువ ఉం టుండేను. ఈ సంవత్సరమే చాలా తక్కువగా నీటి నిలువ తక్కువగా ఉన్నది. దీంతో కొదురుపాక పాత రహదారి శభాష్ పల్లి పాత వంతెన తేలడంతో ప్రజలు మండల ప్రజలు నిర్వాసితులు పాత జ్ఞాపకాలను నెంబరు వేసుకుంటున్నారు.

కోదురుపాక, నీలోజిపల్లి, వరదవెల్లి పాత గ్రామాల ఇల్లు వ్యవసాయ భూములు తేలి ఉన్నాయి. అదేవిధంగా ఇల్లు , వ్యవసాయ భూములు తేలడంతో కొందరు రైతులు కూరగాయల తోటలు ఇతర పంటలను సాగు చేసుకుంటున్నారు. సాగునీరు లేకపోయినా వర్షం పైన ఆధారపడి సాగు చేసుకుంటున్నారు. దీంతో ప్రాజెక్టులో నీరు లేక ప్రాజెక్టు వెల వె ల పొగా మరోవైపు పాత బీటి రహదారి వంతెన తేలడంతో ప్రజలు నిర్వాసితులు ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి చూసి ఒకవైపు బాధపడుతూ మరోవైపు పాత జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. ఇది ఇలా ఉండగా ప్రజలకు నిర్వాసితులకు ప్రయాణం చేసే వారికి ఇది పిక్నిక్ స్పాట్ గా మారింది.