18 April, 2026 | 10:59 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపం

31-05-2025 01:19 AM

హోర్డింగ్ ఎక్కి యువకుడి హల్ చల్ 

హనుమకొండ, మే 30 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో ఎన్నిసార్లు ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్న తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపానికి గురైన ఓ యువకుడు హోర్డింగ్ ఎక్కి హల్ చల్ చేశాడు.

హనుమకొండలోని రాంనగర్ కు చెందిన యువకుడు అబ్దుల్ పాషా పట్టణ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు హోర్డింగ్  ఎక్కాడు. ఇందిరమ్మ ఇండ్ల జాబితాలో తన పేరు రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం మోసం చేసిందని న్యాయం చేసే వరకు హోర్డింగ్ దిగనని చెప్పారు. హోల్డింగ్ ఎక్కిన అబ్దుల్ పాషా. హోంగార్డ్ లతీఫ్ కొడుకుగా పోలీసులు గుర్తించారు. స్థానికులు, పోలీసులు నచ్చజెప్పడంతో హోర్డింగ్ దిగినాడు.