19 April, 2026 | 12:38 AM

ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు మాజీ ఎమ్మెల్యే కిశోర్ విరాళం

31-05-2025 01:19 AM

తుంగతుర్తి, మే 30 : తుంగతుర్తి మండలం గొట్టిపర్తిలో జూన్ 2 నుంచి 5 వరకు జరిగే శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపనకు మాజీ ఎమ్మెల్యే కిశోర్ విరాళమును శుక్రవారం బీఆర్‌ఎస్ నాయకులు ఆలయ కమిటీ సభ్యులకు 25వేల విరాళం అందజేశారు. మాజీ ఎమ్మెల్యే కిశోర్ కు గ్రామస్తులు, కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

విరాళం పంపిణీ చేసిన వారిలో  బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తాటికొండ సీతయ్య, రాములు గౌడ్, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, బీఆర్‌ఎస్ నాయకులు తెడ్డు హరిబాబు, బర్ల సోమన్న, దూదిగాని లింగయ్య, బాలగాని ప్రవీణ్, దొంగరి వెంకన్న, తాళ్లపల్లి యాకన్న, రాజరికం వెంకటాచారి, చింతకుంట్ల సురేష్, పరశురాము, గునిగంటి నగేష్ తదితరులు పాల్గొన్నారు.