రోడ్డు పక్కనే చెత్తగుట్టలు కథనానికి స్పందించిన అధికారులు
17-07-2026 08:00 PM
జవహర్‌నగర్,(విజయక్రాంతి): రోడ్డు పక్కన చెత్త గుట్టలు ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. సంబంధిత మున్సిపల్ సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపించి చెత్తను తొలగించే చర్యలు చేపట్టారు. ఇకపై ఆ ప్రాంతంలో మళ్లీ చెత్త వేయకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేపడతామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని కీసర డిప్యూటీ కమిషనర్ రామలింగం తెలిపారు. స్థానికులు కూడా పరిశుభ్రతకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.






