అయ్యప్ప ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడు బొగ్గుల సురేష్‌కు సన్మానం
08-06-2026 03:38 PM
గజ్వేల్,(విజయక్రాంతి): గజ్వేల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షుడిగా ఎన్నికైన బొగ్గుల సురేష్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ, ఆలయ అభివృద్ధి, భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో నూతన కమిటీ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
బొగ్గుల సురేష్ నాయకత్వంలో ఆలయానికి మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. నూతన బాధ్యతలు స్వీకరించిన బొగ్గుల సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసిన చైర్‌పర్సన్, కమిటీ సభ్యులందరూ సమన్వయంతో పనిచేసి ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






