8 June, 2026 | 4:51 PM

ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా గ్రామసభ

08-06-2026 03:42 PM

రుద్రంగి,(విజయక్రాంతి): ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా రుద్రంగి గ్రామ సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించారు.ఈ సందర్భంగా పర్యవరణ పరిరక్షణ గురించి ప్రజలకు వివరించారు. గ్రామంలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చేందుకు గ్రామస్థులు సహకరించాలని కోరారు. అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని చెత్త చెదారం బయట  పడేయకుండా గ్రామ పంచాయతీ వాహనానికి అందించాలని సూచించారు. రెండు సంవత్సరాల ప్రజా పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాల గురించి వివరించారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం,మహాలక్ష్మి సిలిండర్లు,తెల్ల రేషన్ కార్డులు,రైతులకు రుణమాఫీ,రైతు భరోసా, గృహ జ్యోతి పథకం,పెన్షన్ చేయూత,మహిళ సంఘాలకు వడ్డీ లేని రూణాలు,ఇందిరమ్మ చీరలు, కళ్యాణ లక్ష్మీ పథకం, అలాగే ఫ్రీ బస్,సన్న బియ్యం,వంటి పథకాలను ప్రజలకు అందించినట్టు తెలిపారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే సహకారంతో రుద్రంగి గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగస్వాములు కావాలని సూచించారు. అంగన్వాడీ సెంటర్ లో బాలింతలకు గర్భవతులకు చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నట్టు తెలిపారు.

రైతులు పంటమార్పిడి విధానాన్ని అనుసరించాలని అలాగే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వరి కొయ్యలు తగులపెట్టకుడదని సూచించారు. పర్యవరణన్నీ పరిరక్షించడంలో మహిళలు కీలక పాత్ర పోషించాలని సూచించారు.వాహనదారులు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని హెల్మెట్ తప్పకుండా ధరించాలని సూచించారు. అలాగే వర్ష కాలంలో ప్రజలు విద్యుత్ స్థంబాలకు దూరంగా ఉండాలని తడి చేతులతో విద్యుత్ వస్తువులను తాకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నారులను ప్రభుత్వ బడికి పంపించాలని సర్కారు బడిలో విద్యార్థులకు కావాల్సిన అన్ని షౌకార్యాలు ఉన్నాయని తల్లిదండ్రులు గమనించి చిన్నారులను ప్రభుత్వ బడికి పంపించాలని సూచించారు. టిబి పేసేంట్లు బిపి పేసేంట్లు,గర్భవతులు,స్థానిక హెల్త్ సబ్ సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.