పంచాయతీల్లో కలుపు మందు పిచికారీ.!
22-08-2026 10:23 PM
- నాటుకోళ్ళు మృత్యువాత
బిజినేపల్లి: మండలంలోని ఆయా గ్రామాల వీధుల్లో పెరిగిన కలుపు మొక్కలను పారిశుధ్యం తనలో భాగంగా పిచ్చి మొక్కలను నివారించేందుకు పంచాయతీ సిబ్బంది చేసిన పిచికారీ మందులకు నాటుకోళ్లు మృతి చెందుతున్నాయి. ఈ దుర్ఘటన మండలంలోని శాయిన్ పల్లి గ్రామంలో గత రెండు రోజులుగా చోటు చేసుకుంది. ఈ విషయం శనివారం వెలుగు చూడగా అప్పటికే గ్రామాల్లో సామాన్యుల నాటు కోళ్లు 15 నుండి 20 దాకా మృతి చెందినట్లు బాధితులు తెలిపారు. ఈ విషయమై ఎంపిడిఓ కథలప్ప వివరణ కొరగ కలుపు మందు పిచికారీ చేయడానికి వీలు లేదని, కలుపు మందు పిచికారీ నిలుపు చేసేందుకు ఆదేశాలు ఇస్తామన్నారు. చనిపోయిన కోళ్ళకు నష్ట పరిహారం విషయమై అడిగితే దానికేం చేస్తాం అని దాటవేస్తారు.






