20 June, 2026 | 8:51 PM

Breaking News

బాధిత కుటుంబాలకు ‘పీఎస్ఆర్’ భరోసా   •   మా అభాగ్యుల వృద్ధాశ్రమాన్ని సందర్శించిన ఎస్పీ   •   సింగరేణి ఏరియాలో అంతర్జాతీయ యోగా దినోత్సవం: జి ఎం షాలెం రాజు..   •   కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ లేదు   •   మత్తు రహిత పటిష్ట సమాజ నిర్మాణానికి యోగ ఒక్కటే మార్గం   •   గిరిజన ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి సమిష్టి కృషి   •   ఉద్యాన పంటల సాగును 5 లక్షల ఎకరాలకు విస్తరించాలి   •   అధిక సాంద్రత పత్తి సాగులో న్యూమాటిక్ ప్లాంటర్‌తో విత్తనాల విత్తకం ప్రదర్శన   •   డిజిటల్ లిటరసీ, ఏఐ నైపుణ్యంతో ఉజ్వల భవిష్యత్తు   •   రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్   •  

ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో దోసపాటికి ఘన సన్మానం

20-06-2026 07:42 PM

మణుగూరు,(విజయక్రాంతి): తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నిర్మించ నున్న తెలంగాణ భవన నిర్మాణ కమిటీ చైర్మన్‌గా ఎంపికైన ప్రముఖ వ్యాపారి, ఎస్‌కేటీ గ్రూప్ చైర్మన్ దోసపాటి వెంకటేశ్వరరావును ఆర్యవైశ్య సంఘం, వాసవీ క్లబ్ ఆధ్వర్యంలో శనివారం  ఘనంగా సన్మానించారు. గుట్టమల్లారంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ... వెంకటేశ్వరరావు వాసవీ క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెం ట్‌గా సేవలందిస్తూ అనేక సామాజిక, సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఉచిత అంతిమ రథ యాత్ర సేవ, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పన, మండలంలోని పలు ఆలయాలకు ప్రధాన దాతగా సేవలంది స్తున్న ఆయనకు ఈ బాధ్యత రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆలయ పూజారులు వేద మంత్రోచ్ఛరణ లతో ఆశీర్వచనాలు అందించగా, పట్టణ ప్రముఖులు, ఆర్యవైశ్య సంఘం మండల, పట్టణ నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో ఘనంగా సత్క రించారు.