రాజీ మార్గమే రాజమార్గం: సీనియర్ సివిల్ జడ్జి కే.సురేష్
కోదాడ,(విజయక్రాంతి): రాజీ మార్గమే రాజ మార్గం అని సీనియర్ సివిల్ జడ్జి, మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కే.సురేష్ అన్నారు. శనివారం కోదాడ కోర్ట్ లో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఉమర్ తో కలిసి జాతీయ లోక్ ఆదాలత్ ను ప్రారంభించి మాట్లాడారు. రాజీమార్గమే రాజమార్గమని కక్షలు, పట్టింపులకు పోయి కక్షిదారులు నష్టపోవద్దని సూచించారు.
సత్వర న్యాయానికి లోక్ అదాలత్ లు సహకరిస్తాయని కక్షిదారులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విలువైన కాలాన్ని ఆర్థిక నష్టాన్ని కాపాడుకొని ప్రశాంత జీవనాన్ని గడపాలని ఆకాంక్షించారు. కోదాడ కోర్టులో క్రిమినల్ కేసులు 48,సివిల్ 8, బ్యాంక్ కేసులు 24 పరిష్కరించారు. బ్యాంకు కేసుల రికవరీ రూపంలో 10 లక్షలు వసూలు చేశారు. అడ్మిషన్ కేసులు 86 పిట్టి కేసులు 976 పరిష్కరించి 4 లక్షల 77 వేల రూపాయలు ఫైన్ రూపంలో వసూలు చేశారు.






