22 March, 2026 | 1:42 PM

అత్యాచార నిందితున్ని కాల్చిన మహిళా ఎస్సై

01-06-2025 12:00 AM

లక్నో, మే 31: నాలుగేండ్ల చిన్నారిపై అత్యాచారం చేసినట్టు ఆరోప ణ లు ఎదుర్కొంటున్న లక్నో వ్యక్తిని మ హిళా ఎస్సై సకీనా ఖాన్ ఎన్‌కౌంటర్ చేయగా.. అతడికి గాయాలయ్యాయి. కమల్ కిషోర్ అనే నిందితున్ని సకీ నా ఖాన్ ఎన్‌కౌంటర్ చేయగా.. గాయాలపాలైన అతడిని పోలీసులు ఆ సుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మే  28వ తేదీన ఈ ఘటన జరిగింది. నిందితుడు కమల్ ఉన్నాడన్న సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లడంతో కాల్పులకు దిగా డు. ఎస్సై తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్పులు జరిపి నిందితుడిని గాయపర్చింది. ఈ కేసు బా ధితురాలికి సకీనా కౌన్సిలింగ్ ఇస్తున్నారు.