26 May, 2026 | 6:17 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలి: ఎస్పీ అఖిక్ మహాజన్

16-06-2024 11:03 AM

రాజన్న సిరిసిల్ల, (విజయక్రాంతి): శాంతియుతంగా పండుగలు జరుపుకోవాలని, సోషల్ మీడియాలో వచ్చే ఏలాంటి వదంతులను పుకార్ల ను నమ్మ వద్దని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అన్ని మతాలకు చెందిన ప్రజలు సోదర భావంతో, శాంతియుత వాతావరణంలో పండుగలను జరుపుకుంటూ, మత సామరస్యానికి ప్రతీకగా నిలవాలన్నారు.

సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు, ఇతరుల మనోభావాలు దెబ్బతినే విధంగా అభ్యంతరకర పోస్టులు వచ్చిన ప్రజలు అట్టి పోస్టులను చూసిన వెంటనే ప్రతిస్పందించకుండా, సంయమనం పాటిస్తు అట్టి పోస్టుల్లో నిజానిజాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలని,సామాజిక మాధ్యమంల్లో వచ్చే వదంతులను నమ్మవద్దని వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు.సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను పోస్ట్ చేసిన ,ఫార్వార్డ్ చేసిన వారితో పాటుగా గ్రూప్ అడ్మిన్లపై చట్టప్రకారం చర్యలు  తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.