3 August, 2026 | 12:41 PM

మృతుల కుటుంబాలకు శీనన్న ఆత్మీయ భరోసా

03-08-2026 12:11 PM

కూసుమంచి, (విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో ఇటీవలే మృతి చెందిన మృతుల కుటుంబాలకు రాష్ట్ర రెవెన్యూ గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశాలమేరకు పీఎస్ఆర్ ట్రస్ట్ నుంచి అర్థిక సహాయాన్ని కూసుమంచి కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు సోమవారం బాధితులకు అందజేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) మృతుల కుటుంబాలకు అండగా ఉండేందుకు, భరోసా ఇచ్చేందుకు అర్థిక సహాయం అందిస్తున్నారని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి క్యాంప్ కార్యాలయ ఇంచార్జ్ భీమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు మంకెన వాసు, మండల పార్టీ అధ్యక్షుడు బజ్జూరి వెంకట్ రెడ్డి, నాయకులు జొన్నలగడ్డ రవికుమార్, జూకూరి గోపాల్ రావు, పెండ్ర అంజయ్య, చాట్ల పరుశురాం, కంచర్ల జీవన్ రెడ్డీ, చిలకబత్తిని రామారావు, సర్పంచులు నూకల శోభన్ బాబు, వడ్తియా వెంకట్, సోషల్ మీడియా బాధ్యులు రఫీ తదితరులు పాల్గొన్నారు.