భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
గండీడ్ : నాలుగు సంవత్సరాలుగా భార్య కాపురానికి రావడంలేదని ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గండీడ్ మండలంలోని వెన్నచెడ్ గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామస్తులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. కొడంగల్ మండలం చెట్లపల్లి గ్రామానికి చెందిన శిరీష అనే మహిళతో గండీడ్ మండలం వెన్నచెడ్ గ్రామానికి చెందిన బాలరాజుతో గత ఆరు సంవత్సరాల క్రితం వివాహం అయింది.
గత ఐదు సంవత్సరాల నుంచి భార్య కాపురానికి రావడం లేదని భర్త బాలరాజు పెద్దల సమక్షంలో పలుమార్లు పంచాయతీ జరిగింది. అప్పటికి భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపానికి చెందిన భర్త బాలరాజు గత మూడు రోజుల క్రితం గడ్డి మందు తాగారు. గుర్తించిన కుటుంబ సభ్యులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. గత మూడు రోజుల నుంచి చికిత్స పొందిన బాలరాజు గడ్డి మందు వికటించి గడిచిన రాత్రి మరణించారు. బాలరాజు మృతి కీ సంబంధించి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.






