అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్న సినీప్రముఖులు
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ శనివారం తెల్లవారుజామున చంచల్‌గూడ జైలు నుంచి విడుదలైన అనంతరం పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ఆయన ఇంటికి చేరుకున్నారు. పుష్ప-2 చిత్ర దర్శకుడు సుకుమార్, చిత్ర నిర్మాత దిల్ రాజు, సినీ నటుడు విజయ్ దేవరకొండ, మరో దర్శకుడు కె. రాఘవేంద్రరావు, రానా, హరీశ్ శంకర్, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆర్.నారాయణమూర్తి, నాగచైతన్య, తదితర ప్రముఖులు బంజారాహిల్స్‌లోని ఆయన ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు. బాలకృష్ణ అల్లు అర్జున్ ను ఫోన్ లో పరామర్శించారు.
అల్లు అర్జున్‌ను చూసి చిరంజీవి భార్య, మేనత్త సురేఖమ్మ భావోద్వేగానికి గురయ్యారు. చంచల్‌గూడ జైలు నుండి విడుదలైన తర్వాత, అల్లు అర్జున్ మొదట తన గీతా ఆర్ట్స్ కార్యాలయానికి మరియు తరువాత తన నివాసానికి వెళ్లారు. దాదాపు 12 గంటలపాటు జైలులో గడిపిన ఆయన హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌పై విడుదలయ్యారు.






