10 July, 2026 | 3:00 PM

ఎవ్వరికి మెసేజ్ ఇవ్వను.. తీసుకోను

15-12-2024 12:00 AM

నటుడు ఉపేంద్ర యూఐ మూవీతో అ లరించడానికి సిద్ధమవుతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్, వీనస్ ఎంటర్‌టైన ర్స్, కేపీ శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం డి సెంబర్ 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఉపేంద్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు. 

‘యూఐ’ కాన్సెప్ట్, ఐడియా ఎలా మొదలైంది ? 

-మన ఎడ్యుకేషన్ సిస్టంలో ఏ ఫర్ ఆపి ల్.. బి ఫర్ బ్యాట్.. ఇలా నేర్పించారు. వా ళ్లు ఏం చెప్తే అది బైహాడ్ చేసుకుని దాన్నే నేర్చుకున్నాం. అదొక సిస్టంలాగా మారిపో యి థింకింగ్ కెపాసిటీ తగ్గిపోయింది. అప్పు డే ఏ ఫర్ ఆపిల్‌తో ఇంకొన్ని వర్డ్స్ చెప్పుం టే మన ఆలోచన మరోలా ఉండేది. నా కథల్లో కూడా అలాంటి ఏదైనా ఒక కొత్త ఆలోచననే చెప్పాలనే ప్రయత్నం చేశా.

అమీర్ ఖాన్ ని కూడా మీ సినిమా కదిలించింది కదా ? 

-అమీర్ ఖాన్ గారు చాలా బిగ్ స్టార్. ఆయనకి మా సి నిమా నచ్చడం చాలా ఆనందంగా ఉంది.  

ఒక ఆవేశంతో కూడిన కథలు చెప్పాలనే ధైర్యం మీకెలా వచ్చింది? 

-ఏమో నాకే తెలియదండి. నా కు చెప్పాలనిపించింది సినిమా ద్వారా చెప్పేస్తాను. ఏంజెల్స్ వెళ్లడానికి భయపడే దారిలో.. ఒక పూల్ వెళ్తాడని సామెత ఉంది. బహుశా ఆ గట్  ఫీలింగ్ తో వెళ్తున్నానేమో(నవ్వుతూ)

క్యారెక్టర్ లుక్ పరంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు? 

-నిజానికి లుక్ విషయంలో ఇందులో చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. ఏడాది స్క్రిప్ట్ కి పడి తే మరో ఏడాది లుక్, క్యారెక్టర్ డిజైన్‌కే పడుతుంది.

సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత తెలుగులో మళ్లీ సినిమా చేయకపోవడానికి కారణం? 

-అల్లు అర్జున్ నా ఫేవరెట్ యాక్టర్. నేను ఆయనకి ఫ్యాన్ ని. అలాగే త్రివిక్రమ్ గారు చాలా ఇష్టం. ఆ ఇద్దరు కాంబినేషన్లో సన్ ఆఫ్ సత్యమూర్తి చేయడం చాలా ఆనందాన్నిచ్చింది. ఆ సినిమా తర్వాత కూడా కొన్ని కథలు వచ్చాయి. అయితే నా మూవీ వర్క్స్ ఉండడం వల్ల చేయడం కుదరలేదు. 

మీ కథల్లో బాధపడే వాళ్ళని క్వశ్చన్ చేస్తారేంటి? 

మనం ఎక్కువగా ప్రాబ్లం గురించే మా ట్లాడుతాం తప్ప సొల్యూషన్ గురించి ఎవరు మాట్లాడరు. ఎందుకంటే సొల్యూషన్ ఇవ్వడం చాలా డిఫికల్ట్. ఈ విషయంలో కొంచెం ట్రై చేస్తాను. సొల్యూషన్ ఇక్కడే ఉంది దా ని గురించి ఆలోచించండి అని చెప్పడానికి ప్రయత్నిస్తాను. 

ఒక ఫిలిం మేకర్ గా ఏదైనా మార్పు చేయాలని ఆలోచన ఉంటుందా ? 

మార్చడానికి నేను ఎవరిని? నన్ను నేనే మార్చుకోలేకపోతుంటాను. నేను మెసేజ్ ఇవ్వను. తీసుకోను. ఈ సినిమాలో కూడా అదే చెప్పాను (నవ్వుతూ).