12 May, 2026 | 10:53 AM

Breaking News

కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •   చెట్టుపై పండ్లను తినేందుకు వెళ్లి వలలో చిక్కుకొనిచనిపోతున్న పక్షులు   •   ఇల్లందులో రాజకీయ దుమారం..   •  

ఎట్టకేలకు డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

07-09-2024 01:11 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): ఎట్టకేలకు విద్యాశాఖ డీఎస్సీ తుది కీని శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. ఇక త్వరలోనే ఫలితాలను విడుదల చేయనున్నారు. ఫైనల్ కీతోపాటు రెస్పాన్స్ షీట్లను సైతం పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ www.schooledu.telangana.gov.in http:s//www.schooledu.telangana.gov.in అందుబాటులో ఉంచినట్లు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఇవి.నర్సింహారెడ్డి ప్రకటన విడుదల చేశారు. అభ్యర్థులు ఎవరికి వారు తుది కీ ప్రకారం తమకు పరీక్షల్లో వచ్చిన మార్కులను తెలుసుకోవచ్చు.  ఆగస్టు నెల చివరనే తుది కీ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యాశాఖ అధికారులు...నేడు రేపు అంటూ కీని వాయిదా వేస్తూ వచ్చారు. దీనిపై అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.  చివరకు తుది కీను తాజాగా అధికారులు విడుదల చేశారు. 

ఒక్కో సెషన్‌లో ఐదారు ప్రశ్నల్లో తప్పులు!

ఆగస్టు 13న ప్రిలిమినరీ కీని విడుదల చేసి దాదాపు 28,500 అభ్యంతరాలను స్వీకరించారు. మొత్తం 26 సెషన్లలో పరీక్షలు జరిగాయి. అన్ని సెషన్లలో కలిపి దాదాపు వందకు పైగా ప్రశ్నలను మార్చినట్లు తెలుస్తోంది. తప్పుడు జవాబు, ప్రశ్నలకు మార్కులు కలిపారు.