10 July, 2026 | 12:12 PM

ప్రజావాణి ఫిర్యాదుతో అక్రమ నిర్మాణం తొలగింపు

10-07-2026 11:29 AM

భిక్కనూర్, జూలై 10(విజయ క్రాంతి): భిక్కనూర్ శివారులో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ షెడ్డును గ్రామపంచాయతీ అధికారులు గురువారం జేసీబీ సహాయంతో తొలగించారు. గ్రామపంచాయతీ కార్యనిర్వహణాధికారి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. ఇటీవల స్థానికులు మహేందర్ రెడ్డి, నరేందర్ రెడ్డి ప్రజావాణిలో అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేయగా, జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విచారణ అనంతరం చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. గ్రామంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపట్టిన వారిపై చట్టపరమైన చర్యలు కొనసాగుతాయని, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టవద్దని గ్రామపంచాయతీ అధికారులు హెచ్చరించారు.