ఎస్సీ సెల్ మండల అధ్యక్షులుగా గుర్రం పుష్పరాజ్
గుండాల,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల(SC Cell Mandal President) అధ్యక్షులుగా నియమించినందుకు పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులు గుర్రం పుష్పరాజ్ శుక్రవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...నన్ను నమ్మి ఇంత పెద్ద బాధ్యత నాపై పెట్టిన శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు, డీసీసీ అధ్యక్షులు తోట దేవిప్రసన్నకు మరియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ పొంబోయిన ముత్తయ్యకు, జిల్లా కార్యదర్శి ఎస్కే ఖదీర్ కు, నూతనంగా నియమితులైన గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఊకే బుచ్చయ్యకు ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నానని, మీరు ఇచ్చిన ఈ పదవికి న్యాయం చేస్తూ జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గద్దల రమేష్ సూచనలు, సలహాలు పాటిస్తూ పని చేస్తానని అన్నారు. పార్టీ నాయకుల ఆదేశానుసారం ప్రజల కోసం పని చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.






