10-09-2024 11:23:21 AM
హైదరాబాద్: మహాత్మా బాపు రావు పూలే ప్రజా భవన్ లో జరిగే ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేయడం జరిగిందని ప్రజావాణి నోడల్ అధికారి దివ్య తెలిపారు. ప్రజాభవన్ లో 16వ ఆర్థిక సంఘం సమావేశాలు జరుగుతున్నందున మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్టు ఆమె పేర్కొన్నారు. ఈ మార్పును అనుసరించి అర్జీదారులు బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని దివ్య ఒక ప్రకటనలో తెలిపారు.