9 May, 2026 | 3:22 PM

Breaking News

బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే సబితా   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •   తడిసిన ప్రతి గింజ కొనాలి.. ఎకరానికి 20 క్వింటాళ్ల జొన్న కొనుగోలు చేపట్టాలి: ఎమ్మెల్యే   •  

ఆడబిడ్డ పెళ్లికి రూ.50,000 సాయం

09-05-2026 02:19 PM

​తలకొండపల్లి: ఎన్నికల వేళ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ, గ్రామంలోని నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు చీపునుంతల సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ. శనివారం గ్రామానికి చెందిన మద్దూరి సువర్ణ-వెంకటయ్య దంపతుల కుమార్తె శాలిని వివాహ మహోత్సవానికి సర్పంచ్ లక్ష్మమ్మ,  నాయకులు మాలే రవీందర్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానం మేరకు గ్రామంలోని నిరుపేద కుటుంబాల ఆడబిడ్డల పెళ్లిళ్లకు 'పెళ్లి కానుక'ను అందజేస్తున్నట్లు తెలిపారు.

పేద కుటుంబాలపై పెళ్లి భారమై కుంగిపోకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగానే శాలిని వివాహానికి ₹50,000 నగదును అందజేసినట్లు వివరించారు.సమయానికి ఆర్థిక సాయం అందించి తమ బిడ్డ పెళ్లికి అండగా నిలిచిన సర్పంచ్ లక్ష్మమ్మకు, మాలే రవీందర్ రెడ్డికి లబ్ధిదారు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.