9 May, 2026 | 3:31 PM

Breaking News

బంద్ విజయవంతం చేసిన ప్రజలకు ధన్యవాదాలు   •   బండి సంజయ్ కొడుకుపై పోక్సో కేసు.. స్పందించిన సబితా ఇంద్రారెడ్డి   •   రేపు హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. పర్యటన షెడ్యూల్‌ ఇదే..!   •   వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా సహకార అధికారి రామ్మోహన్ రావు   •   సొసైటీ అసిస్టెంట్ మృతుడు కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత   •   VOAల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా   •   సచివాలయంలో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం   •   శ్రీశైలంలో మరో సైబర్ మోసం.. ఢిల్లీ భక్తులకు టోకరా   •   బొంద పెట్టడానికి స్థలం లేదు..!   •   రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల కోసం చిత్తశుద్ధితో పని చేస్తుంది   •  

మాటల ప్రభుత్వం కాదు.. మాది చేతల ప్రభుత్వం

09-05-2026 02:16 PM

వరంగల్,(విజయక్రాంతి): వర్ధన్నపేటలో 46 లక్షల 90 వేల రూపాయలతో ఆకేరు వాగు మీద చెక్ డ్యాం శాశ్వత మరమ్మత్తు పనులకు స్థానిక శాసన సభ్యులు కె.ఆర్ నాగరాజుతో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రజా పాలన, ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేసిన రైతు వారము కార్యక్రమంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ గత పాలకులు ప్రజల సమస్యలు ఏనాడు పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.

ఏరియా ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేసిన రోజుల్ని గుర్తు చేసుకున్న  ఎంపీ.. అప్పట్లో వర్షాలు వస్తే రోడ్లపై పెద్ద ఎత్తున నీరు నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని తెలిపారు. ఆరేళ్లు ఇక్కడ వైద్యురాలిగా పనిచేసిన సమయంలో ఆ సమస్యను ఎన్నిసార్లు చూసినా.. గత ఎమ్మెల్యే దానిపై కనీస ఆలోచన కూడా చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు చొరవతో శాశ్వత మరమ్మత్తు పనులు ప్రారంభమవుతున్నాయని తెలిపారు. ప్రజలు ఇకపై వర్షాకాలంలో ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కాంగ్రెస్ మాటల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. ప్రజలకు ఉపయోగపడే పనులకే ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటికే తన ఎంపీ నిధుల నుంచి రూ.1.25 కోట్లు వర్ధన్నపేట నియోజకవర్గ అభివృద్ధికి మంజూరు చేశానని, ప్రతి ఏడాది రూ.50 నుంచి రూ.60 లక్షల వరకు అభివృద్ధి పనులకు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు నియోజకవర్గ సమస్యలను నిత్యం తెలుసుకుంటూ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

ఈ నియోజకవర్గానికి ఆడబిడ్డగా నా వంతు సహాయ సహకారాలు ఎప్పటికీ అందిస్తూనే ఉంటాను అని ఎంపీ కావ్య పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’ ద్వారా 90 రోజుల వ్యవధిలో ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరవేస్తూ, పెండింగ్ సమస్యలకు వేగంగా పరిష్కారం చూపడం జరుగుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సారంగపాణి, వైస్ చైర్మన్ శోభారాణి, ఇరిగేషన్ ఎస్ ఈ రాంప్రసాద్, ఈ ఈ కిరణ్ కుమార్, డీ ఈ రాజు, ఏ ఈ అమర్నాథ్, మార్కెట్ చైర్మన్ వెంకటయ్య, టెంపుల్ చైర్మన్ ప్రభాకర్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.