11 May, 2026 | 2:18 AM

ఆడబిడ్డ పెళ్ళికి ఆర్థిక సహాయం

11-05-2026 12:46 AM

కంగ్టి, మే 10: మండలంలోని జీర్గి తాండ పంచాయతీ, రామ్ సింగ్ తాండలో గోపాల్ అనే రైతుకు ఆరుగురు ఆడబిడ్డలు ఉండడంతో మొదటి బిడ్డపెళ్లికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న సంగారెడ్డి జిల్లా గిరిజన ఉపసర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు రాథోడ్ సురేష్ సింగ్ వారికి ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.

గతంలో కూడా కొంత మంది ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం చేయడం జరిగిందని, మున్ముందు కూడా బీద ఆడబిడ్డల పెళ్లికి తనకు తోచిన ఆర్థిక సహాయం అందిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాథోడ్ సంతోష్, డాక్టర్ గోపాల్, తాండవాసులు పాల్గొన్నారు.