యాదవ సంఘం శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ సన్నాహక సమావేశం
23-08-2026 07:01 PM
జనగామ, ఆగస్టు 23 (విజయక్రాంతి): యాదవ సంఘం శ్రీకృష్ణ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ముత్తయ్య యాదవ్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున జనగామ జిల్లా కేంద్రంలోని గాయత్రీ ఫంక్షన్ హాల్ లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ నాయకులు మాట్లాడుతూ.. సెప్టెంబర్ 4న జరగనున్న శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లు, కార్యాచరణపై చర్చించి దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామం నుండి, మండలం నుండి జిల్లా నుండి యాదవ బంధువులంతా పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు, యువజన సభ్యులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






