13 March, 2026 | 2:11 AM

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సాయం

13-03-2026 12:36 AM

చిన్నంబావి, మార్చి 12:స్నేహితుడి కుటుంబానికి తోటి మిత్రులు ఆర్థిక సాయం అందజేసి అండగా నిలిచారు.2008- 2009 లో దగడపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో దగడపల్లి గ్రామానికి చెందిన మహేష్ పదవ తరగతి చదివాడు.

ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పూర్వ స్నేహితులు గురువారం గ్రామానికి వెళ్లి బాధితకుటుంబాన్ని పరామర్శించారు. రూ.35,000 ఆర్థికసాయాన్ని బాధిత కు టుంబ సభ్యులకు అందజేసి అండగా ఉం టామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పలువురు స్నేహితులు పాల్గొన్నారు.