13 March, 2026 | 5:56 AM

పోటీ తత్వం పెంచేందుకే..

13-03-2026 12:35 AM

గట్టు మార్చి,12:విద్యార్థుల్లో సాధారణ జ్ఞానం పోటీ భావన పెంపొందించేందుకు క్విజ్ పోటీలు ఎంతగానో ఉపయోగపడతాయని హెచ్‌ఎం నల్లారెడ్డి అన్నారు.గురువా రం ఎల్ టిఎం మరియు శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గట్టు మరియు మాచర్ల కాంప్లె క్స్ ఆధ్వర్యంలో ఉన్న తొమ్మిదవ తరగతి విద్యార్థులకు గట్టు మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో క్విజ్ పోటీలను నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఎం మా ట్లాడుతూ.. విద్యార్థులు చదువుతోపాటు జ్ఞా నం పెంపొందించుకోవడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థానాలను సాధించవచ్చు అ ని తెలిపారు.అనంతరం క్విజ్ పోటీల్లో ప్రతి భ కనబరిచిన విద్యార్థులకు బహుమతుల ను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు నరసిం హులు గౌడ్, హనుమంతు,గంగయ్య రంగస్వామి, శ్రీశైలం, పాల్గొన్నారు.