1 June, 2026 | 7:05 PM

వడదెబ్బ బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

01-06-2026 06:16 PM

చెన్నూర్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో వారం కిందట వడ దెబ్బతో చనిపోయిన అశోక్  చారీ కుటుంబానికి కట్ట శ్రీనివాస చార్యులు తనవంతు ఆర్థిక  సహాయం సోమ వారం అందజేశారు. నిరుపేదైన అశోక్ చారి సెంట్రింగ్ పని చేస్తు కుటుంబాన్ని పోషించించుకుంటున్నాడు. కుటుంబాన్ని పోషించే పెద్ద మరణంతో ఆ కుటుంబం పరిస్థితి కడుదయనీయంగా  మారింది.

భార్య, పిల్లలను చూసి చలించి పోయిన కట్ల శ్రీనివాసాచార్యులు తను సాహాయం అందించడమే కాకుండా సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం అందించవలసిందిగా తనకున్న గ్రూపులలో పోస్ట్ చేయగా దానికి స్పందించిన కొందరు విశ్వబ్రాహ్మణ, అన్నమాచార్య సభ్యులు, ఇతరుల  సహకారంతో జమ చేసిన రూ.25,200లను కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో విష్ణు తేజ చారి, దివిజేంద్రా చారి తదితరులు పాల్గొన్నారు.