1 June, 2026 | 7:25 PM

యూసఫ్ పేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా పద్మ

01-06-2026 06:20 PM

పాపన్నపేట: మండల పరిధిలోని యూసుఫ్ పేట ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలుగా బెండల పద్మ సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు హెడ్మాస్టర్ గా పని చేసిన మాలతీదేవి ఇటీవల పదవి విరమణ పొందారు. దీంతో పద్మ హెచ్ఎం గా మాలతీ దేవి నుండి చార్జి తీసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.