08-12-2025 01:29:11 AM
ఎల్బీనగర్, డిసెంబర్ 7 : మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని శివగంగా కాలనీలో ఇటీవల ఒక మూగ బాలుడిపై వీధి కుక్కలు చేసిన తీవ్రమైన దాడి విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్ నాయకుడు జక్కిడి రఘువీర్ రెడ్డి ఆదివారం శివగంగా కాలనీలో పర్యటించి, అనంతరం కాలనీ పెద్దలతో కలిసి నీలోఫర్ ఆసుపత్రికి వెళ్లి బాలుడిని పరామర్శించారు. ఈ సందర్భంగా బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆర్థికసాయం అందజే శారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... బాలుడి కుటుంబానికి జక్కిడి చారిటబుల్ ట్రస్ట్ అండగా ఉంటుందన్నారు. శివగంగ కాలనీలో ఇప్పటికీ చెత్త సేకరణ సరిగ్గా చేయడం లేదని, కాలనీ వాసులు ఎన్ని విన్నపాలు చేసినా, కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో శివగంగా కాలనీ అధ్యక్షులు తొంట బాబు, గిరి శ్రీనివాస్ గౌడ్, దిగ్విజ రెడ్డి, మిర్యాల రమేష్, జానకి రామయ్య, కాలనీ నివాసులు, అనిల్ కుమార్, వీరన్నగుట్ట కాలనీ అధ్యక్షులు నర్సింహా యాదవ్, కేకేఎల్ గౌడ్, ఎల్ల స్వామి, శ్రీకాంత్, హరి గౌడ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.