calender_icon.png 11 December, 2025 | 10:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలి

08-12-2025 01:29:58 AM

-రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం ప్రణాళికలు

-సదస్సుకు కిషన్‌రెడ్డి హాజరు..

-బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, డిసెంబర్ 7 (విజయక్రాంతి): గ్లోబల్ సమ్మిట్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడాన్ని బీజేపీ స్వాగతిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు తెలిపారు. ఈ మేరకు ఆయన  ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

గ్లోబల్ సమ్మిట్ విజయవంతం కావాలని, తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి చెందాలని బీజేపీ ఆకాంక్షిస్తోందన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హాజరవుతారని ఆయన పేర్కొన్నారు. వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్రమోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని, అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధి అయ్యేందుకు అవసరమైన ప్రణాళికలను కేంద్రం రూపొందిస్తోందని తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తోందని ఆయన పేర్కొన్నారు.