ప్లాస్టిక్ గ్లాస్‌లో చాయ్ తాగితే రూ. 3వేల జరిమానా
నాగిరెడ్డిపేట్, మే 4 (విజయక్రాంతి): మండలంలోని పల్లె బోగుడ తండా గ్రామపంచాయతీ ప్లాస్టిక్ నిషేధించాలని ఉద్దేశంతో గ్రామ సర్పంచి పార్వతి శంకర్ పాలకవర్గం సభ్యులు జిపి పరిధిలో గల చాయ్ హోటలలో ప్లాస్టిక్ గ్లాస్ తొలగించి గాజు గ్లాసుల్లో మాత్రమే చాయిని ఇవ్వాలని త్రాగాలని గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్, పాలకవర్గం కలిసి 150 గాజు గ్లాసులను తీసుకువచ్చి జిపి పరిధిలోని చాయ్ హోటళ్లకు 20,30 గాజు గ్లాసులను అందజేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్ తెలిపారు.
గ్రామ పంచాయతీ తీర్మానానికి ఎవరైనా వ్యతిరేకంగా ప్లాస్టిక్ గ్లాసులలో చాయిని ఇచ్చినవారికి 3000 వేల, రూపాయలు, తాగినవారికి మూడు వేల రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని తండ ప్రజల సహకారంతో ముందుకు తీసుకురావడం జరిగిందని దీనికి అందరూ సహకరించి ప్లాస్టిక్ని నిషేధించి గాజు గ్లాసులోనే మాత్రమే చాయిని తాగాలని తెలిపారు.తాండ ప్రజల ఆరోగ్యమే తన ముఖ్యమని ఉద్దేశమని ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పార్వతి శంకర్, ఉప సర్పంచ్ వనిత వినోద్, పాలకవర్గం సభ్యులు తండా ప్రజలు పాల్గొన్నారు.






