5 May, 2026 | 2:58 AM

దూది పరుపుల దుకాణంలో అగ్ని ప్రమాదం

05-05-2026 12:46 AM

అయిజ, మే 4:  అయిజ మునిసిపాలిటీలోని పెట్రోల్ పంపు చౌరస్తా సమీపంలోని దూది పరుపుల దుకాణంలో ప్రమాదవ శాత్తు షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించిందని షాప్ యజమాని రఫీ తెలియజేశారు. దూది పరుపుల అమ్మకం ద్వారానే పొట్ట పోషించుకునే నాకు ఉన్న ఒక్క ఆధారం అగ్నికి ఆహుతి అయిందని సుమారు రెండు లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లిందని, కావున ప్రభుత్వం దయ తలచి నన్ను ఆదుకోవాలని రఫీ కన్నీటి పర్యoత మయ్యాడు