20-01-2026 12:00:00 AM
నార్సింగిలో మున్సిపల్ ఆకస్మిక తనిఖీలు
నిబంధనలు పాటించని వారికి రూ. 20 వేల జరిమానా
మణికొండ, జనవరి 19 (విజయక్రాంతి) : వాణిజ్య సముదాయాల నిర్వాహ కులు నిబంధనల ప్రకారం తప్పనిసరిగా తడి, పొడి చెత్త డబ్బాలను ఏర్పాటు చేసుకోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవని నార్సింగి సర్కిల్-45 డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. స్వచ్ఛతలో భాగంగా సోమవారం సర్కిల్ పరిధిలోని పలు వాణిజ్య ప్రాంతాల్లో మున్సిపల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెత్త వేరు చేసే విధానాన్ని పాటించని దుకాణదారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
దుకాణాల వద్ద తడి, పొడి చెత్త కోసం వేర్వేరు డబ్బాలు ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఒక్కో దుకాణానికి రూ. 1000 చొప్పున జరిమానా విధించారు. సోమవారం ఒక్కరోజే ఇలా నిబంధ నలు ఉల్లంఘించిన వారికి మొత్తం రూ. 20,000 జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ప్రతి వ్యాపారి పారిశు ద్ధ్య నిబంధనలను కచ్చితంగా పాటించాలని, తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచిం చారు. భవిష్యత్తులోనూ ఈ తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు మీరితే జరిమానాలు మరింత కఠినంగా ఉంటాయని స్పష్టం చేశారు.