calender_icon.png 20 January, 2026 | 3:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రొఫెసర్ల నియామకాలపై దుష్ప్రచారాలొద్దు

20-01-2026 12:00:00 AM

రాజేంద్రనగర్, జనవరి 19 (విజయక్రాంతి): కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకాల కోసం ఇచ్చిన ఉద్యోగం నోటిఫికేషన్ ను కొందరు అడ్డుకోనేందుకు అసత్య ఆరోపణలు చేస్తున్నారని వర్సిటీ నాన్ టీచింగ్ అధ్యక్ష్యా, కార్యదర్శులు పోతురాజు యాదయ్య, చెంచు రామయ్యలు ఓ ప్రకటనలో ఖండించారు. కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తూ విశ్వవిద్యాలయ ప్రతిష్టను దెబ్బతిసేందుకు ప్రయత్నించడం సరైంది కాదని మండిపడ్డారు.

గత 12 సంవత్సరాలుగా ఒక్క నియామకం కూడా జరగని ఈ యూనివర్సిటీ ఉపకులపతిగా డాక్టర్ దండా రాజిరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వంతో మాట్లాడి 79 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 17 ప్రొఫెసర్ లు, 44 అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం కోసం అనుమతి తీసుకోని నోటిఫికేషన్ విడుదల చేశారని తెలిపారు. ఈ అసత్య ఆరోపణలను బోర్డు సభ్యులు వైస్ ప్రెసిడెంట్ కే.రాజేశ్వరి,వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఏ. అపర్ణ,కోశాధికారి ఎస్.రాజు అసోసియేషన్ సభ్యులు తీవ్రంగా ఖండించారు.