14 March, 2026 | 4:00 AM

పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్ల పంపిణీ

14-03-2026 12:16 AM

దోమకొండ, మార్చి13,(విజయ క్రాంతి): దోమకొండ మండలం అంబారిపేట జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు హాల్ టికెట్లను గ్రామ సర్పంచ్ ఆరుట్ల కవిత అనిల్ మరియు పాలకవర్గ సభ్యులు పంపిణీ చేశారు. రేపటి నుండి ప్రారంభమయ్యే పరీక్షలను విద్యార్థులు విజయవంతంగా రాయాలని ఆకాంక్షించారు.

పరీక్ష కేంద్రానికి గత మూడు సంవత్సరాలుగా అందిస్తున్న ఉచిత రవాణా సౌకర్యాన్ని ఈ సంవత్సరం కూడా కల్పిస్తామని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి ఫలితాలు సాధించాలని సూచించారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలోఉప సర్పంచ్ సత్య గౌడ్, పాఠశాల ఉపాద్యాయులు,వార్డుసభ్యులు, గ్రామస్తులు, విద్యార్థులు పాల్గొన్నారు.