20-01-2026 12:00:00 AM
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ
సికింద్రాబాద్ జనవరి 19 (విజయ క్రాంతి): సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ రైలు కార్యకలాపాల నిర్వహణలో భద్రత కోసం తీసుకోవలసిన చర్యలపై సమగ్ర సమీక్షా సమావేశాన్ని సోమవారం సికింద్రాబాద్ లోని రైల్ నిలయంలో నిర్వహించారు. ఈ సమీక్షాసమావేశంలో అదన పు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, వివిధ శాఖలకు చెందిన ప్రధానాధిపతులతో పాటు మొత్తం 6 డివిజన్లు అనగా సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు మరియు, నాందేడ్ డివిజనల్ రైల్వేమేనేజర్లు (డి.ఆర్.ఏంలు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ రైళ్లు సజావుగా నడపడానికి ట్రాక్ నిర్వహణ పనులు జరిగే ప్రదేశాలులో భద్రతను నిర్ధారించడం, రైల్వే కార్యకలాపాల్లో పాల్గొనే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, భద్రతా మార్గదర్శకా లను పాటించడంపై, రైళ్లలోని విద్యుత్ పరికరాల భద్రతపై జోన్ వ్యాప్తంగా నిర్వహిం చిన భద్రతా తనిఖీలను కూడా చేపట్టాలని ఉన్నతాధికారులతో జనరల్ మేనేజర్ సంజ య్ కుమార్ శ్రీవాస్తవ సమీక్షించారు.